హైదరాబాద్‌లో జాతీయ మిక్స్డ్ నెట్ బాల్ ఫెడరేషన్ కప్ పోస్టర్ల ఆవిష్కరణ.
హైదరాబాద్: జాతీయ మిక్స్డ్ నెట్ బాల్ ఫెడరేషన్ కప్ ఛాంపియన్షిప్ పోటీల పోస్టర్లను మంగళవారం అంబర్పేట్ అదనపు డీసీపీ జోగుల నర్సయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 8, 9, 10 తేదీల్లో గౌలిపురాలోని ఆలే నరేంద్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ టోర్నమెంట్లో దేశవ్యాప్తంగా 8 జట్లకు చెందిన సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొననున్నారని పేర్కొన్నారు. క్రీడా అభివృద్ధికి ఈ పోటీలు దోహదపడతాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మిక్స్డ్ నెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్. సోమేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, చైర్మన్ డాక్టర్ ఎ. బాలరాజ్, రాష్ట్ర జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బి. లక్ష్మయ్య, అంతర్జాతీయ నెట్ బాల్ ఆటగాడు ఎస్. బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
