కామారెడ్డి శివారులో రోడ్డు ప్రమాదం – 8 మందికి గాయాలు.
బాన్సువాడ ప్రతినిధి షేక్ అమైర్: కామారెడ్డి జిల్లా
కామారెడ్డి పట్టణ శివారులోని చిన్న మల్లారెడ్డి గ్రామం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది గాయపడ్డారు. రాజంపేట మండలం అర్గోండ గ్రామానికి చెందిన చిదుర సిద్ధిరాములు కుటుంబ సభ్యులతో కలిసి వివాహ వేడుకకు కారులో బయలుదేరారు. ఫంక్షన్ హాల్‌కు చేరుకునే క్రమంలో చిన్న మల్లారెడ్డి శివారులో కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సిద్ధిరాములు, ఆయన భార్య వినోధతో పాటు మరో ఆరుగురికి గాయాలు కాగా, అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
