బోధన్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం – 170 మందికి పరీక్షలు.
బోధన్ ప్రతినిధి రాహుల్:- బోధన్ పట్టణంలోని 13వ వార్డు హనుమాన్ గుడి వెనుక లైన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అపెక్స్ వైటెల్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో సుమారు 170 మందికి పైగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించగా, వారికి మల్టీవిటమిన్, క్యాల్షియం మాత్రలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించారు. కంటిశుక్లం (కాట్రాక్ట్) సమస్యతో బాధపడుతున్న 20 మందికి లైన్స్ ఐ హాస్పిటల్‌లో ఉచిత శస్త్రచికిత్సకు అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతు, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు పెద్ద ఊరటనిస్తాయని తెలిపారు. కంటి ఆరోగ్యంపై అవగాహన పెంచడం చాలా అవసరమని, ముందస్తు పరీక్షల ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చని వైద్యులు సూచించారు.

ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ లంకా రవి, కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి, 14వ వార్డు కౌన్సిలర్ చిరంజీవి, క్లబ్ సెక్రటరీ లయన్ పి. నాగభూషణం, కాలనీవాసులు శంకర్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
