బాన్సువాడ ప్రతినిధి :- బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో రేషన్ కార్డులు ఇప్పిస్తామని చెప్పి పేద ప్రజల నుండి ఒక్కొక్కరి వద్ద రూ.5,000 వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై మంగళవారం గ్రామస్తులు బీజేపీ నాయకులతో కలిసి సబ్ కలెక్టర్ కిరణ్మయికి ఫిర్యాదు చేశారు.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామంలోని రేషన్ షాప్ నంబర్ 2901006 డీలర్ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు. ఈ విషయంపై సంబంధిత రెవిన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే నిజాలు బయటపడతాయని వారు పేర్కొన్నారు.