నిజామాబాద్ ప్రతినిధి రాహుల్:- నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆర్య సమాజం దయానంద గోశాలలో నిర్వహించిన బాలబాలికల సదాచార శిక్షణ శిబిరం సమాపన సమారోహం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రదీప్ గుప్తా మాట్లాడుతూ, “పిల్లల్లో సద్గుణాలు, సంస్కారం పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యం. జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే క్రమశిక్షణ, వినయం, ధర్మం అనేవే పునాది” అని ఆధ్యాత్మిక సందేశం అందించారు.