బాన్సువాడ ప్రతినిధి షేక్ అమైర్:- కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మదీనా కాలనీలో తల్లిదండ్రులు వదిలివెళ్లిన ఒక పసికందుపై బాన్సువాడ ఏరియా ఆసుపత్రి వైద్య సిబ్బంది చూపిన మమకారం అందరి హృదయాలను కదిలించింది.
వారం క్రితం మదీనా కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును వదిలివెళ్లగా, స్థానికులు శిశువును రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు శిశువును బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.