నిజామాబాద్ జిల్లా ప్రతినిధి రాహుల్:- బోధన్ మున్సిపల్ కౌన్సిల్‌లో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కె. నగేష్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పాషా మోహినుద్దీన్ ఆధ్వర్యంలో నూతన ఫ్లోర్ లీడర్ తూము శరత్ రెడ్డి, కాంగ్రెస్ కౌన్సిలర్లు కలిసి మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి అధికారిక లేఖను అందజేశారు.