బోధన్ ప్రతినిధి రాహుల్ :- కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పేద ప్రజలను ఉపాధి లేకుండా చేసే కుట్ర చేస్తోందని సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) నాయకులు ఆరోపించారు. శుక్రవారం సాలూర మండలం ఖాజాపూర్ గ్రామం, బోధన్ మండలం నాగనపల్లి గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పార్టీ నాయకులు, ఏఐపీకేఎంఎస్ ప్రతినిధులు పరిశీలించారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ, ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు కూడా అందించడం లేదన్నారు. పని ప్రదేశాల్లో మంచినీరు, టెంట్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, పనిముట్లు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మండుతున్న ఎండల్లో రక్షణ లేకుండా పనులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు
.