రాజంపేట ప్రతినిధి :- రాజంపేట మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో గురువారం సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు, రాజంపేట సబ్ ఇన్‌స్పెక్టర్ బి. మహేష్ సూచనలతో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దని సూచించారు. బ్యాంకు అధికారులు లేదా పోలీసులు ఎప్పుడూ ఫోన్‌లో ఓటీపీ అడగరని స్పష్టం చేశారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.