బోధన్ ప్రతినిధి రాహుల్:- బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాఠశాల నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని బోధన్ జేఏసీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం స్థానిక ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించాయి.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ నాగరాజు, కో-కన్వీనర్ తల్లరే సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధిక సంఖ్యలో విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. పాఠశాల నిర్వహణ, మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు నిధులు కేటాయిస్తున్నాయని పేర్కొన్నారు.