ఎక్సైజ్ అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్.
వర్ని ప్రతినిధి చందర్:- నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని ఓ వైన్స్ దుకాణంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక రేట్లకు మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై స్థానిక వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వినియోగదారుల కథనం ప్రకారం, దుకాణంలో మద్యం బాటిళ్లపై ముద్రించిన ధర కంటే అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అధిక ధరలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించిన కొందరిపై దుకాణం యజమానులు, సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, కొందరిని బెదిరించినట్లు కూడా సమాచారం.