mahimakhadicha.com

మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. 

Telangana news

కామారెడ్డి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర డీజీపీ C. V. Anand సూచనల మేరకు, కామారెడ్డి జిల్లా ఎస్పీ M. Rajesh Chandra ఆదేశాలతో ఈగల్ ఫోర్స్ తెలంగాణ వింగ్ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

 

 

ఈ సందర్భంగా మాదకద్రవ్యాల జోలికి వెళ్లవద్దని, వాటి బారిన పడితే జీవితం అంధకారమవుతుందని, వ్యక్తులు మానసిక సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని పాటలు, ప్రసంగాల ద్వారా విద్యార్థులకు వివరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1908కు ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

 

 

ఈ కార్యక్రమంలో ఈగల్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కళాబృందం ఇన్‌చార్జ్ హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, శేషారావు, ప్రభాకర్, సాయిలు పాటలు, సందేశాల ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.