ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా.. స్పందించకపోతే డీఈఓ కార్యాలయ ముట్టడి హెచ్చరిక.
బోధన్ ప్రతినిధి రాహుల్ : ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్నారంటూ తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీవీపీ) ఆధ్వర్యంలో గురువారం బోధన్ ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా టీవీపీ బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసాలె నాగేష్ మాట్లాడుతూ, గత వారం రోజులుగా ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల విక్రయాలపై తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో పలు పాఠశాలలను ప్రశ్నించగా, విద్యాశాఖ అధికారుల సూచన మేరకే పుస్తకాలు విక్రయిస్తున్నామని యాజమాన్యాలు తెలిపినట్లు చెప్పారు. ఈ విషయమై ఎంఈఓను సంప్రదించగా, ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల అమ్మకాల నిబంధనలపై తనకు అవగాహన లేదని సమాధానం ఇచ్చారని ఆరోపించారు.