బోధన్ ప్రతినిధి రాహుల్ : బోధన్ మండల కేంద్రం రాంపూర్ గ్రామం లో నిరుపేద కుటుంబాలకు చెందిన పాఠశాల విద్యార్థులకు శనివారం ఉచితంగా స్కూల్ కిట్లను పంపిణీ చేశారు.( ‘వర్డ్’) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డోలే సాయికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ఈ కిట్లను అందజేశారు.పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో సర్పంచ్ డోలే సాయికుమార్ స్వయంగా స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, షార్పనర్లు, ఎరేజర్లు మరియు వాటర్ బాటిళ్లతో కూడిన పూర్తి కిట్లను డొనేట్ చేశారు.