రహదారిపై ఏర్పడిన గుంతల్లో వరి నాట్లు వేసి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. గుంతల కారణంగా ప్రతిరోజూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని వారు తెలిపారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ రహదారిని అధికారులు వెంటనే పరిశీలించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ బోధన్ పట్టణ అధ్యక్షుడు పసులోటి గోపికిషన్, 11వ వార్డు కౌన్సిలర్ కొలిపాక రేణుక బాలరాజు, సీనియర్ నాయకులు గొడుగు ధర్మపురి, గుంత గంగాధర్, రాజులదేవి పవన్ కుమార్, మాసిని వినోద్, హన్మాండ్లు చారి, పట్టణ ప్రధాన కార్యదర్శి మీర్జాపూర్ అరవింద్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఏనుగంటి గౌతమ్ గౌడ్, పప్పుల వేణు, కన్నె శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, గడ్డం శ్రీనివాస్, ఫణీంద్ర, సందీప్ తదితరులు పాల్గొన్నారు.