చండూరు ప్రతినిధి రాము:- తెలంగాణ ప్రభుత్వం చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 7 నుంచి 12 వరకు నిర్వహించనున్న జాతీయ చేనేత దినోత్సవ వేడుకలకు చండూరులో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ వేడుకలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు చండూరు చేనేత సహకార సంఘం అధ్యక్షుడు పున్న ధర్మేందర్, పాలకవర్గ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.