చండూరు ప్రతినిధి రాము : చండూరు పట్టణంలోని 1వ వార్డు సత్య హరిశ్చంద్ర నగర్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం కోసం స్థానిక ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచి బురదమయంగా మారుతోంది. దీంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, పాఠశాల విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.