వర్ని ప్రతినిధి చందర్ : గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా, అభివృద్ధి చెందిన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు వర్ని గ్రామ సర్పంచ్ కనకదుర్గ రవి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, ప్రతి ఇంటికి హరితహారం మొక్కలను పంపిణీ చేస్తున్నారు. ఆటో ద్వారా ఇంటింటికీ చెత్తను సేకరిస్తూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానాన్ని అమలు చేస్తున్నారు.