బాన్సువాడ ప్రతినిధి వడ్ల శ్రీనివాస్ చారీ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కాదులపూర్ గ్రామంలో గురువారం “ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్” (FFS) ఎరువుల బుకింగ్ యాప్‌పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారి జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు యాప్ వినియోగం, ఎరువుల బుకింగ్ విధానంపై అవగాహన కల్పించారు.