వర్ని ప్రతినిధి చందర్: వర్ని మండలంలోని జాకోర, శంకోర గ్రామాల్లో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాల్లో పర్యటించి నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు.
జాకోర గ్రామంలో ఎస్‌డీఎఫ్ నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనాన్ని పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. మహిళా సంఘాల సమావేశాలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం జాకోర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో నిర్మించిన దుకాణ సముదాయం, ప్రహరీ గోడను ప్రారంభించారు.