Telangana newsMay 27, 2026
Telangana news

బక్రీద్ సందర్భంగా బోధన్‌లో పార్సెల్ పంపిణీ.

लेखक : Gajanan Gangadhar Bidkar   |  May 27, 2026

బక్రీద్ సందర్భంగా బోధన్‌లో పార్సెల్ పంపిణీ.

బోధన్ ప్రతినిధి రాహుల్ :- బోధన్ పట్టణంలో బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్‌గాహ్ వద్ద పార్సెల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దామన్న, సరితతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్రీద్ నమాజ్‌కు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. ముఖ్యంగా తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ మరియు భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

అనంతరం పండుగ సందర్భంగా అవసరమైన కుటుంబాలకు పార్సెల్‌లను పంపిణీ చేసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

 

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు, పలువురు ప్రజలు పాల్గొన్నారు.