Telangana newsMay 27, 2026
Telangana news

హనుమాన్ చాలీసా పారాయణానికి మూడేళ్లు పూర్తి.

लेखक : Gajanan Gangadhar Bidkar   |  May 27, 2026

హనుమాన్ చాలీసా పారాయణానికి మూడేళ్లు పూర్తి.

బోధన్ ప్రతినిధి రాహుల్‌:- నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పెద్ద హనుమాన్ మందిరంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభమై మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

 

 

 

ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణంలో ప్రతిభ కనబరిచిన ఆరుగురు చిన్నారులకు ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ ఎగ్జామ్ ప్యాడ్లు, స్కేల్‌లు, పెన్నులు బహుమతులుగా అందజేశారు. భక్తి భావంతో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్న పిల్లలను ఆయన అభినందించారు.

హనుమాన్ చాలీసా పారాయణంలో ప్రతిభ కనబరిచే ప్రతి ఒక్కరికీ దేవాలయం తరఫున ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి ఉన్న పిల్లలందరూ హనుమాన్ చాలీసా నేర్చుకుని తమ ప్రతిభను ప్రదర్శించాలని కోరారు.

 

 

ఈ కార్యక్రమంలో గాయత్రి ఇడ్లీ సెంటర్ గంగాధర్, విజయ గురుస్వామి, కె. దత్తాత్రి, రవికాంత్, సిరిగిరి నాగనాథ్, రమేష్, బద్ధం సత్యనారాయణతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది.