Telangana newsMay 28, 2026
Telangana news

కోనాపూర్‌లో ఘనంగా బక్రీద్ వేడుకలు.

लेखक : Gajanan Gangadhar Bidkar   |  May 28, 2026

కోనాపూర్‌లో ఘనంగా బక్రీద్ వేడుకలు.

బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్ :- కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో బక్రీద్ పండగను ముస్లిం సోదరులు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఈద్గా, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దేశ శాంతి, సామరస్యాల కోసం ప్రార్థనలు చేశారు.

 

 

 

పండగ సందర్భంగా కోనాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ దేశ్ముఖ్ వెంకటరమణ రావు తన నివాసంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ముస్లిం సోదరులతో అలైబలై నిర్వహిస్తూ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగానికి, సేవాభావానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, ముస్లిం సోదరులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు.