Telangana newsMay 31, 2026
Telangana news

అక్రమ ఇసుక డంపులను స్వాధీనం చేసుకోవాలి: గ్రామస్తుల డిమాండ్.

लेखक : Gajanan Gangadhar Bidkar   |  May 31, 2026

అక్రమ ఇసుక డంపులను స్వాధీనం చేసుకోవాలి: గ్రామస్తుల డిమాండ్.

 

కొప్పర్గ ప్రతినిధి రాహుల్ :- బోధన్ మండలంలోని కొప్పర్గ గ్రామంలో ప్రభుత్వ భూముల్లో నిల్వ చేసిన అక్రమ ఇసుక డంపులను వెంటనే స్వాధీనం చేసుకుని, వాటిని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు వినియోగించాలని గ్రామస్తులు అధికారులను కోరారు.

 

 

 

గ్రామంలో రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తరలించి డంపులు వేస్తున్నారని, అనంతరం రెంజల్ మండలం మీదుగా ఇతర ప్రాంతాలకు టిప్పర్ల ద్వారా రవాణా చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. అక్రమ ఇసుక రవాణా కారణంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లడంతో పాటు గ్రామాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని వారు పేర్కొన్నారు.

 

 

 

అక్రమ ఇసుక వ్యాపారంలో పాల్గొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని, ఇసుక మాఫియాను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ భూముల్లో ఉన్న అక్రమ ఇసుక డంపులను సీజ్ చేసి పేదల గృహ నిర్మాణ అవసరాలకు వినియోగించాలని అధికారులను కోరారు.