Telangana newsJune 14, 2026
Telangana news

జర్నలిజం రంగంలో మరిన్ని విజయాలు సాధించాలి: కమిషనర్ జిన్న జగ్జీవన్.

लेखक : Gajanan Gangadhar Bidkar   |  June 14, 2026

జర్నలిజం రంగంలో మరిన్ని విజయాలు సాధించాలి: కమిషనర్ జిన్న జగ్జీవన్.

బాన్సువాడ ప్రతినిధి షేక్ అమైర్: కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన బాన్సువాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్‌ను ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ జిన్న జగ్జీవన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

 

 

ఈ సందర్భంగా కమిషనర్ జిన్న జగ్జీవన్ మాట్లాడుతూ, సుధాకర్ గౌడ్ జర్నలిజం రంగంలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు. సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని, కలం సైనికుల సేవలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు.

 

 

 

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా విశేష కృషి చేస్తోందని ఆయన అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సుధాకర్ గౌడ్ మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు.

 

 

ఈ కార్యక్రమంలో బుడిమి మాజీ సర్పంచ్ లక్ష్మీనాం దేవ్, సొసైటీ డైరెక్టర్ నర్వ శంకర్, నాగాదర్, డాక్టర్ గోవింద్, జిన్న రవి, నర్వ నారాయణ, జిన్న లక్ష్మణ్‌తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొని సుధాకర్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.