Telangana newsJune 15, 2026
Telangana news

దోమకొండ కెనరా బ్యాంకులో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.

लेखक : Gajanan Gangadhar Bidkar   |  June 15, 2026

దోమకొండ కెనరా బ్యాంకులో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.

దోమకొండ ప్రతినిధి : కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో దోమకొండలోని కెనరా బ్యాంకులో సైబర్ నేరాలు, ఓటీపీ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు దోమకొండ సబ్‌ఇన్‌స్పెక్టర్ శ్రీ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సైబర్ మోసాలకు గురైన వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే బ్యాంకు అధికారులు, పోలీసు అధికారులు ఎప్పటికీ ఓటీపీలు అడగరని, కాబట్టి తమ ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని అవగాహన కల్పించారు.

 

 

 

అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112 నంబర్లకు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. పోలీసు కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, శేషరావు, పీసీలు ప్రభాకర్, సాయిలు పాటలు, సందేశాత్మక ప్రదర్శనల ద్వారా సైబర్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్సై శ్రీనివాస్, కామారెడ్డి షీ టీమ్‌కు చెందిన డబ్ల్యూపీసీ ప్రవీణ, కెనరా బ్యాంకు మేనేజర్, బ్యాంకు సిబ్బంది, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఖాతాదారులు పాల్గొన్నారు. సైబర్ నేరాల నివారణలో ప్రజల అప్రమత్తతే ప్రధాన ఆయుధమని అధికారులు పేర్కొన్నారు.