Hyderabad newsJune 16, 2026
Hyderabad news

ప్రజా సేవకు అంకితమైన నాయకుడు వి. హనుమంతరావుకు జన్మదిన శుభాకాంక్షలు

लेखक : Gajanan Gangadhar Bidkar   |  June 16, 2026

ప్రజా సేవకు అంకితమైన నాయకుడు వి. హనుమంతరావుకు జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్ :- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ సలహాదారు, మాజీ మంత్రి మరియు మాజీ ఎంపీ V. Hanumantha Rao (వీహెచ్) జన్మదిన సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

 

ఈ సందర్భంగా శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. సుదర్శన్ మాట్లాడుతూ, వి. హనుమంతరావు నిరంతరం ప్రజల పక్షాన నిలిచే నిఖార్సైన నాయకుడని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.


సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజా సంక్షేమం పట్ల ఆయన చూపుతున్న అంకితభావం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజా సేవలో విశిష్ట పాత్ర పోషిస్తున్న వి. హనుమంతరావు ఆయురారోగ్యాలతో, ఆనందంతో మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.