Telangana newsJune 18, 2026
Telangana news

లింగంపేట గ్రామీణ బ్యాంక్‌లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.

लेखक : Gajanan Gangadhar Bidkar   |  June 18, 2026

లింగంపేట గ్రామీణ బ్యాంక్‌లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.

ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దని, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన.

కామారెడ్డి ప్రతినిధి:-  కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో గురువారం సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు లింగంపేట సబ్-ఇన్‌స్పెక్టర్ శ్రీ దీపక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

 

 

ఈ సందర్భంగా ప్రజలకు సైబర్ మోసాల పట్ల జాగ్రత్తలు వివరించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు ఇతరులకు చెప్పవద్దని సూచించారు. బ్యాంకు అధికారులు లేదా పోలీసు అధికారులు ఎప్పుడూ ఓటీపీలు అడగరని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.

పోలీస్ కళాబృందం ఇన్‌చార్జ్ హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, శేషరావు, పీసీలు ప్రభాకర్, సాయిలు పాటలు, సందేశాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.

 

 

కార్యక్రమంలో ఎల్లారెడ్డి షీ టీమ్ సభ్యులు పీసీ శ్రీశైలం, డబ్ల్యూపీసీ సుప్రజ, బ్యాంక్ మేనేజర్ డి. జ్యోతి, బ్యాంక్ సిబ్బంది, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఖాతాదారులు పాల్గొన్నారు.