Telangana newsJune 18, 2026
Telangana news

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన ప్రధానోపాధ్యాయుడు రామచందర్ గైక్వాడ్.

लेखक : Gajanan Gangadhar Bidkar   |  June 18, 2026

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన ప్రధానోపాధ్యాయుడు రామచందర్ గైక్వాడ్.

మొదటి విడతలో 60 శాతం పుస్తకాలు పంపిణీ.. మిగతా పుస్తకాలు త్వరలో అందనున్నట్లు అధికారుల వెల్లడి.

బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్: నిజామాబాద్ జిల్లా దక్షిణ మండలంలోని కోటగల్లి శంకర్ భవన్ ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విద్యాశాఖ సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు రామచందర్ గైక్వాడ్ చేతుల మీదుగా అందజేశారు.

 

 

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థులు విద్యా సంవత్సర ప్రారంభం నుంచే పాఠ్యాంశాలపై పూర్తి అవగాహన సాధించేందుకు పాఠ్యపుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. మొదటి విడతలో సుమారు 60 శాతం పాఠ్యపుస్తకాలు మాత్రమే పాఠశాలకు అందాయని, మిగిలిన పుస్తకాలు రెండో విడతలో త్వరలో చేరనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలియజేశారని చెప్పారు.

 

 

విద్యార్థులు పుస్తకాలను సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించాలని ఉపాధ్యాయులు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.