Telangana newsJune 18, 2026
Telangana news

ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భద్రంను పరామర్శించిన కాంగ్రెస్ నాయకుడు అడపా అనిల్ చౌదరి.

लेखक : Gajanan Gangadhar Bidkar   |  June 18, 2026

ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భద్రంను పరామర్శించిన కాంగ్రెస్ నాయకుడు అడపా అనిల్ చౌదరి.

నవగీతం ప్రతినిధి ఉపేంద్ర :-  ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామానికి చెందిన విలసాగరపు భద్రం గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గుర్తించిన అదే గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కల్యాణపు రమేష్ చొరవ తీసుకుని ఖమ్మంలోని ఆస్పత్రిలో చేర్పించి వైద్య చికిత్స అందిస్తున్నారు.

 

 

 

ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకుడు అడపా అనిల్ చౌదరి ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న భద్రంను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు.

 

 

ఈ సందర్భంగా భద్రం వైద్య ఖర్చుల నిమిత్తం అడపా అనిల్ చౌదరి ఆర్థిక సహాయం అందజేసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. భద్రం త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు డాక్టర్ కల్యాణపు రమేష్, అడపా అనిల్ చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.