Telangana newsAugust 2, 2026
Telangana news

వర్నిలో ప్లాస్టిక్ కవర్లకు చెక్.. నేటి నుంచే నిషేధం అమలు.

लेखक : Gajanan Gangadhar Bidkar   |  August 2, 2026

వర్నిలో ప్లాస్టిక్ కవర్లకు చెక్.. నేటి నుంచే నిషేధం అమలు.

వర్ని ప్రతినిధి చందర్:  నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామపంచాయతీ పాలిథిన్ ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై నేటి నుంచి పూర్తిస్థాయి నిషేధాన్ని అమలు చేసింది. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ కనకదుర్గ రవి వెల్లడించారు.

 

 

గ్రామ ప్రజలు మార్కెట్‌కు వెళ్లే సమయంలో తప్పనిసరిగా ఇంటి నుంచే జూట్ లేదా వస్త్ర సంచులు తీసుకెళ్లాలని సూచించారు. గ్రామపంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ కవర్లను విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిబంధనలు తొలిసారి ఉల్లంఘించిన వారికి రూ.2,000 జరిమానా, రెండోసారి ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా విధిస్తామని తెలిపారు. దుకాణదారులు వెంటనే ప్లాస్టిక్ కవర్ల విక్రయాన్ని నిలిపివేసి, పర్యావరణహిత ప్రత్యామ్నాయ సంచులను వినియోగించాలని కోరారు.

 

 

ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించి గ్రామాన్ని పరిశుభ్రంగా, హరితంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని గ్రామ సర్పంచ్ కనకదుర్గ రవి, గ్రామపంచాయతీ కార్యదర్శి నాగరాజు విజ్ఞప్తి చేశారు.