Telangana newsAugust 3, 2026
Telangana news

ఎస్సీ కార్పొరేషన్ రుణం మళ్లించే ప్రయత్నం.. బాధితుడి ఆరోపణ.

लेखक : Gajanan Gangadhar Bidkar   |  August 3, 2026

ఎస్సీ కార్పొరేషన్ రుణం మళ్లించే ప్రయత్నం.. బాధితుడి ఆరోపణ.

వర్ని ప్రతినిధి చందర్: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని కోటయ్య క్యాంప్‌కు చెందిన ఈబత్వర్ మారుతి (తండ్రి: గంగారం) తనకు మంజూరు కావాల్సిన ఎస్సీ కార్పొరేషన్ రుణాన్ని ఓ స్థానిక నాయకుడు తన అనుచరుడికి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గత కొన్నేళ్లుగా కిరాయి ఇంట్లో నివాసముంటూ లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న తాను జీవనోపాధి అభివృద్ధి కోసం ఎస్సీ కార్పొరేషన్ రుణానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

రుణం మంజూరయ్యే ప్రక్రియలో ఉండగా స్థానికంగా రాజకీయ జోక్యం జరిగిందని, దీనిపై సంబంధిత అధికారులను కలిసి వివరణ కోరినా సంతృప్తికరమైన సమాధానం లభించలేదని మారుతి పేర్కొన్నారు. తనకు అర్హత మేరకు రుణం మంజూరు చేసి న్యాయం చేయాలని, రుణాల ఎంపికలో పారదర్శకత పాటిస్తూ రాజకీయ లేదా వ్యక్తిగత జోక్యాన్ని అరికట్టాలని సంబంధిత శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.