Telangana newsAugust 6, 2026
Telangana news

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు.

लेखक : Gajanan Gangadhar Bidkar   |  August 6, 2026

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు.

బాన్సువాడ ప్రతినిధి షేక్ అమైర్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు.

 

 

కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాలు తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాదిగా నిలిచాయని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేశారని అన్నారు.

 

 

 

జయశంకర్ ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, తెలంగాణ ఆత్మగౌరవ పరిరక్షణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఫెరోజ్ ఖాన్, ఖలీల్, మాక్బూల్, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యుడు అక్బర్, నాయకులు అబ్దుల్ ఖాదర్, రమేష్ యాదవ్, మోచి గణేష్, అతిఫ్ అజీమ్, లాయక్, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.