Telangana newsSeptember 20, 2026
Telangana news

100 మీటర్ల పరుగు పందెంలో సత్తా చాటిన తాడ్కోల్ యువకుడు.

लेखक : Gajanan Gangadhar Bidkar   |  September 20, 2026

బాన్సువాడ ప్రతినిధి విశ్వంబార్ పుల్కర్ణి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన శివ రాష్ట్రస్థాయి 100 మీటర్ల పరుగు పందెం పోటీలకు ఎంపికయ్యాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో శివ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు.

 

ప్రస్తుతం శివ స్పార్క్ మైండ్ పాఠశాలలో పీఈటీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. క్రీడల పట్ల ఆసక్తితో పాటు క్రమశిక్షణతో సాధన చేస్తూ ఈ విజయాన్ని అందుకున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి మంచి ఫలితాలు సాధించాలని పాఠశాల యాజమాన్యం ఆకాంక్షించింది.

 

ఈ సందర్భంగా ఆదివారం పాఠశాల యాజమాన్యం, సిబ్బంది శివను ఘనంగా సన్మానించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ పాశం రాజిరెడ్డి, కరస్పాండెంట్ కిరణ్, డైరెక్టర్ రామేశ్వర్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.