సత్యనారాయణపురంలో విజయవంతంగా పల్స్ పోలియో కార్యక్రమం.

సత్యనారాయణపురంలో విజయవంతంగా పల్స్ పోలియో కార్యక్రమం.

వర్ని ప్రతినిధి చందర్: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సత్యనారాయణపురం గ్రామ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కనకదుర్గ–రవి పాల్గొని ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు.

 

 

 

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదండ్రులు పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే అన్ని టీకాలు వేసినా కూడా ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ, “చిన్నారుల భవిష్యత్తుకు రక్షణ కవచం పల్స్ పోలియో” అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పోలియోను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.

 

 

 

ప్రజలు తమ సమీపంలోని పల్స్ పోలియో కేంద్రాలకు ఐదేళ్లలోపు చిన్నారులను తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని, ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించి ఇతరులను కూడా ప్రోత్సహించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. “రండి… పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవుదాం” అని పిలుపునిచ్చారు.