వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి)
రంగారెడ్డి ప్రతినిధి వినోద్: దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కానుగుల మహేష్ రూపొందించిన పండుగ శుభాకాంక్షల వాల్ పోస్టర్ను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి) గురువారం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పండుగల ప్రాముఖ్యతను చాటుతూ ప్రజలకు దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ కార్యక్రమం సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బాటసింగారం సర్పంచ్ గౌరీ శంకర్, జపాన్ సర్పంచ్ రవి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గ రాములు, మున్సిపల్ పార్టీ జనరల్ సెక్రటరీ మడుపు వేణుగోపాల్, నాయకులు బతికి రాజు, జగదీష్, మోజాకిర్, బద్రీనాథ్, డొంకొని గోపి గౌడ్, సోయల్, వీరేష్, గౌతమి తదితరులు పాల్గొన్నారు.
