జర్నలిస్ట్ జగన్ కుటుంబానికి అండగా ఉంటాం.

కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి అభిషేక్ రెడ్డి భరోసా.. కుటుంబానికి ఆర్థిక సాయం.

 

రంగారెడ్డి ప్రతినిధి వినోద్: ఆకస్మికంగా మృతి చెందిన నవతెలంగాణ మంచాల మండల రిపోర్టర్ పల్నాటి జగన్ కుటుంబానికి అండగా ఉంటామని కాంగ్రెస్ నాయకుడు మల్‌రెడ్డి అభిషేక్ రెడ్డి భరోసా ఇచ్చారు.

 

జగన్ మృతి విషయం తెలుసుకున్న అభిషేక్ రెడ్డి వెంటనే నోముల గ్రామానికి చేరుకుని ఆయన పార్థివదేహంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తక్షణ సాయంగా కొంత ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జర్నలిస్టుగా ప్రజలకు సేవలందించిన జగన్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో మాట్లాడి కుటుంబాన్ని ఆదుకునేందుకు అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.