ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమక్షంలో పార్టీలోకి ఆహ్వానం.
రంగారెడ్డి ప్రతినిధి వినోద్ : యాచారం మండలం మాల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరింది. గ్రామ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ కొండాపురం మల్లమ్మతో పాటు వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు తమను ఎంతగానో ఆకర్షించాయని తెలిపారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న ఎమ్మెల్యేకు మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. మాల్ గ్రామ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ప్రతినిధి గుర్నాగిరెడ్డి, యాచారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీశైలం, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ గోపాల్, నాయకులు కోలమని రామకృష్ణ, పాశం జయప్రకాశ్, విక్కీ, రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ పద్మజ, జాంగిర్, మురళి, గిరి, గాలయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
