ఇద్దరు ఆడపిల్లల చదువుకు అండగా నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాలే రవీందర్ రెడ్డి.
తలకొండపల్లి ప్రతినిధి వినోద్ : రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామానికి చెందిన చాల చీమల బిక్షపతి (45) గత వారం రోజుల క్రితం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాలే రవీందర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా బిక్షపతి భార్య జంగమ్మకు వారి ఇద్దరు కుమార్తెల చదువుల కోసం రూ.1,00,000 (లక్ష రూపాయలు) ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం మాలే రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు. ఆపద సమయంలో ఎవరూ అధైర్యపడవద్దని, బాధిత కుటుంబానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుజ్జుల లక్ష్మమ్మ, ఆశన్న, మాజీ సర్పంచ్ బండి రఘుపతి, నాయకులు ఎర్ర వెంకట్, రాజిరెడ్డి, మాలి రామచందర్ రెడ్డి, రాజీవ్ రెడ్డి, పెంటయ్య, నరేష్, యాదగిరి, శివ, శామెల్లు, చెన్నకేశవులు, చెన్నయ్య, పరమేష్, వెంకటయ్య, రాజు, పర్వతాలు, జంగయ్య, రామకృష్ణయ్య, రాములు తదితర గ్రామ నాయకులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.
