ఇంటి నిర్మాణానికి సిమెంట్ బస్తాల అందజేత.
మాడుగుల ప్రతినిధి వినోద్: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం నాగిళ్ల గ్రామానికి చెందిన పాలకూర్ల వెంకటయ్య కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర నాయకులు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అండగా నిలిచారు.
ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంకటయ్య కుటుంబానికి ఇంటి నిర్మాణం కోసం అవసరమైన సిమెంట్ బస్తాలను అందజేశారు. ఇంటి నిర్మాణంలో భాగంగా ఫ్లోరింగ్ పనులకు సహకారం అందించిన ఉప్పల వెంకటేష్‌కు, ఇందుకు తోడ్పడిన గ్రామ సర్పంచ్ సంతోష్ రాజ్ గౌడ్‌కు కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబానికి ఇంటి నిర్మాణం కోసం సహాయం అందించడం ఎంతో సంతోషంగా ఉందని, తమకు అండగా నిలిచిన ఉప్పల వెంకటేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సురమల చెన్నయ్య, పాలకూర్ల వెంకటయ్య, శేఖర్, లక్ష్మయ్య, బందెల జగన్, చాట్ల యాదయ్య, వడ్డేమోని శ్రీకాంత్, రమేష్, శ్రీశైలం, జంగయ్య, శేఖర్, లక్ష్మయ్య, దేశ రథం వెంకటేష్, పల్లకి నరసింహ తదితరులు పాల్గొన్నారు.
