గ్రీన్ పార్క్ ఫంక్షన్ హాల్ వెనుక మహిళ మృతదేహం లభ్యం.

షాద్‌నగర్‌లో కలకలం.. గుర్తుతెలియని మహిళగా గుర్తింపు

రంగారెడ్డి ప్రతినిధి వినోద్: షాద్‌నగర్ పట్టణంలోని చటాన్‌పల్లి రైల్వే గేట్ సమీపంలో ఉన్న గ్రీన్ పార్క్ ఫంక్షన్ హాల్ వెనుక గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. ఫంక్షన్ హాల్‌లోని వంటగది వెనుక భాగంలో మహిళ మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం.

 

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళ ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవారు? అనే వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మహిళ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఫంక్షన్ హాల్ వెనుక మహిళ మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.