బాన్సువాడలో రేషన్ కార్డుల పేరుతో డబ్బుల వసూళ్లు – డీలర్‌పై చర్యల డిమాండ్.

బాన్సువాడలో రేషన్ కార్డుల పేరుతో డబ్బుల వసూళ్లు – డీలర్‌పై చర్యల డిమాండ్.

బాన్సువాడ ప్రతినిధి :- బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో రేషన్ కార్డులు ఇప్పిస్తామని చెప్పి పేద ప్రజల నుండి ఒక్కొక్కరి వద్ద రూ.5,000 వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై మంగళవారం గ్రామస్తులు బీజేపీ నాయకులతో కలిసి సబ్ కలెక్టర్ కిరణ్మయికి ఫిర్యాదు చేశారు.

 

 

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామంలోని రేషన్ షాప్ నంబర్ 2901006 డీలర్ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు. ఈ విషయంపై సంబంధిత రెవిన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే నిజాలు బయటపడతాయని వారు పేర్కొన్నారు.

 

 

డీలర్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అతని డీలర్‌షిప్‌ను రద్దు చేయాలని, అలాగే బాధితుల నుండి వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

 

 

 

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి స్పందిస్తూ, వెంటనే విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

 

 

ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, నాయకులు నాగరాజు, రాజారెడ్డి, సంతోష్, తుకారాం, సరిత, దత్తు, లక్ష్మణ్, రాజాసింగ్ మరియు బాధితులు పాల్గొన్నారు.