కల్దుర్కిలో అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ.
కల్దుర్కి ప్రతినిధి రాహుల్ :- బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు, సభ్యులు అహల్యాబాయి హోల్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు అహల్యాబాయి హోల్కర్‌ను ప్రజాహిత పాలకురాలిగా కొనియాడుతూ, ఆమె చేసిన సేవలు, పాలనాదక్షత, సమాజాభివృద్ధికి చేసిన కృషి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను అనుసరించి సమాజ సేవకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, సభ్యులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
