వర్నిలో ఘనంగా ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ జన్మదిన వేడుకలు.

వర్నిలో ఘనంగా ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ జన్మదిన వేడుకలు.

వర్ని ప్రతినిధి చందర్ : నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ముందుగా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో కేక్ కట్ చేసి ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

 

 

 

తదుపరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని నాయకులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వర్ని ఏఎంసీ చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా, పీసీసీ డెలిగేట్ కొనిపూర్ రాజిరెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వెలగపూడి గోపాల్, PACS అధ్యక్షులు నామాల సాయిబాబా, నేమని వీర్రాజు, అబ్దుల్ భారీ, కలాల్ గిరి, గంగా ప్రసాద్, మాచవరపు రవి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.