ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాలి: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.

పర్వతాపూర్ గ్రామంలో బీసీ కమిటీ హాల్, మహిళా సంఘం భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే.

రంగారెడ్డి ప్రతినిధి వినోద్ : గ్రామాల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు.

 

కొత్తూరు మండలంలోని పర్వతాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన బీసీ కమిటీ హాల్, మహిళా సంఘం భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ పాల్గొని వాటిని ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. పర్వతాపూర్ గ్రామానికి ఇప్పటికే 37 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

 

అదేవిధంగా సుమారు రూ.40 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, పైప్‌లైన్ పనుల కోసం నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. గ్రామంలో 107 వీధిదీపాలను మంజూరు చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

 

గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించడంలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. నూతనంగా నిర్మించిన బీసీ కమిటీ హాల్, మహిళా సంఘం భవనాలు ఆయా వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.

 

అనంతరం గ్రామ పర్యటనలో భాగంగా దుర్గామాత ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సూచన కృష్ణారెడ్డి, పీఎస్‌ఎస్ చైర్మన్ అనిత, జితేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, ఏసీఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, సర్పంచులు ఆంజనేయులు, అమర్నాథ్ రెడ్డి, నరసింహులు, జంగయ్య, రాజ్‌కుమార్, శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ అంజిరెడ్డి, మల్లేష్ గౌడ్, పర్వతాపూర్ గ్రామ సర్పంచ్ అశోక్, పీఎస్‌ఎస్ డైరెక్టర్ రత్నమ్మ, రాములు, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు రాకేష్, వార్డు సభ్యులు సరిత, నరసింహులు, పద్మమ్మ, మల్లేష్, సునీత, అశోక్, డబ్బు నర్సింహులు, నాయకులు శ్యాంసుందర్, జంగయ్య, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.