సీసీ రోడ్డు, వరద నీటి కాలువ నిర్మాణ పనులపై పరిశీలన.

అధికారులతో కలిసి లెవెల్స్ పరిశీలించిన మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్‌రెడ్డి.

రంగారెడ్డి ప్రతినిధి వినోద్ : రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలోని హైకోర్టు కాలనీ డివిజన్‌లో రోడ్లు, వరద నీటి కాలువ నిర్మాణ పనులపై మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఆటో సాయినగర్ నుంచి ద్వారకామైనగర్ మీదుగా హైకోర్టు కాలనీ వరకు నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు పనులతో పాటు వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా చేపట్టనున్న వరద నీటి కాలువ నిర్మాణ పనుల కోసం సంబంధిత అధికారులతో కలిసి ఆయన లెవెల్స్‌ను పరిశీలించారు.

 

 

ద్వారకామైనగర్ ప్రధాన రహదారిపై చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులతో పాటు 600 ఎంఎం డయా పైపులైన్‌తో నిర్మించనున్న వరద నీటి కాలువకు సంబంధించిన సాంకేతిక అంశాలను అధికారులతో చర్చించారు.

 

రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోకుండా ముందస్తు ప్రణాళికతో పనులు చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్మాణాలు నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను కోరారు.

 

ఈ కార్యక్రమంలో డీఈ దామోదర్, ఏఈ విజ్ఞేశ్వరి, వర్క్ ఇన్‌స్పెక్టర్ సురేష్, కాలనీ నివాసులు తదితరులు పాల్గొన్నారు.