సాలూర మండలంలో రేపు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమం.
సాలూర ప్రతినిధి రాహుల్ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు సాలూర మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందర్నా రవి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నిర్మాణం పూర్తయిన ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యువజన నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
