పైడిమల్ గోదాములో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం.

పైడిమల్ గోదాములో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం.

జాకోరా ప్రతినిధి చేందర్ :-  నిజామాబాద్ జిల్లా జాకోరా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని పైడిమల్ గోదాములో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. సంఘం అధ్యక్షులు బర్దావల్ దశరథ్ ఆధ్వర్యంలో వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కె. సురేష్ బాబా కేంద్రాన్ని ప్రారంభించారు.

 

 

 

ఈ సందర్భంగా సురేష్ బాబా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని తమ జొన్న పంటను విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం క్వింటాల్‌కు రూ.3,699 పొందవచ్చని తెలిపారు. దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని రైతులకు సూచించారు.

 

 

 

ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు నరెడ్ల చిన్న సాయిలు, బంజ గంగారామ్, సర్పంచులు గీతా సీతారాం, ఎన్. గంగారాం, జి. శ్రీనివాస్ రావు, ఉప సర్పంచ్ బి. రాజేష్, వర్ని పీఏసీఎస్ చైర్మన్ ఎన్. సాయిబాబు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.