విజయ సంకల్ప యాత్రకు టీయూఎఫ్ పిలుపు.
ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు 101 కార్లతో ఈ నెల 29న యాత్ర • వాల్ పోస్టర్ విడుదల చేసిన కనకం కుమారస్వామి.
బోధన్ ప్రతినిధి రాహుల్ :- తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టీయూఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 29న నిర్వహించనున్న విజయ సంకల్ప యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను టీయూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనకం కుమారస్వామి ఆదివారం బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ప్రాంతానికి చెందిన ఉద్యమకారుడు మిర్జాపురం రాహుల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కనకం కుమారస్వామి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కేకే కమిటీ ద్వారా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలను స్వాగతిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ నుంచి జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ వరకు 101 కార్లతో చేపట్టనున్న విజయ సంకల్ప యాత్రలో తెలంగాణ ఉద్యమకారులు, ప్రాంతమిత్రులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ఉద్యమకారులు కోరుకునేది గౌరవమేనని, వారి త్యాగాలు మరియు సేవలను సమాజం గుర్తించాలని అన్నారు. ఉద్యమకారుల ఐక్యతను చాటిచెప్పే ఈ యాత్రను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యమకారులు తరలిరావాలని కోరారు. భవిష్యత్తులో కూడా ఉద్యమకారుల హక్కుల సాధన కోసం పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతామని తెలిపారు.
కార్యక్రమం చివరలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి సహకరిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
