రాంపూర్ పంచాయతీలో విజయవంతంగా పల్స్ పోలియో కార్యక్రమం.

రాంపూర్ పంచాయతీలో విజయవంతంగా పల్స్ పోలియో కార్యక్రమం.

బోధన్ ప్రతినిధి రాహుల్ :-  నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

 

 

 

సర్పంచ్ డోలే సాయికుమార్ మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, సాధారణ టీకాలు పూర్తయినా పల్స్ పోలియో చుక్కలు అదనంగా వేయించడం ఎంతో అవసరమని తెలిపారు.

పోలియోను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి కుటుంబం బాధ్యతగా ముందుకు రావాలని అధికారులు సూచించారు. గ్రామ ప్రజలు తమ చిన్నారులను పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కంటే సాయికుమార్, ఏఎన్‌ఎం విజయలక్ష్మి, ఆశా వర్కర్ శివబాయి తదితరులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.